Pashamylaram : పాశమైలారంలో ఉద్రిక్తత. ఎండీపై సర్కార్‌ సీరియస్‌

సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 36మంది మరణించినట్లు ఉన్నా..అంతకంటే ఎక్కువమందే చనిపోయారని తెలుస్తోంది.మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

New Update
pashamylam

pashamylam

Pashamylaram : సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 36 మంది మరణించినట్లు ఉన్నా.. అంతకంటే ఎక్కువమందే చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ సిగాచి పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. గల్లంతైన తమ వారి గురించి యాజమాన్యం గాని, పోలీసులు గాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా ఈ ఉదయం నుంచి బాధితులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తమ వారి ఆచూకీ కోసం కళ్ళు కాయలు కాచేలా కంపెనీ వద్దే బాధితులు నిలబడ్డారు. ఉదయం నుండి ఘటనా స్థలంలో అధికారులు పత్తా లేకుండా పోయారు. మంత్రితో పాటు ఇతర నాయకులు రావడంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు.

ఘటన స్థలానికి వచ్చి న మంత్రి దామోదరను బాధితులు అడ్డుకున్నారు. మంత్రి నిస్సహాయంగా రావడంతో బాధితులు తిరగబడ్డారు.  మీడియాలో బాధితుల వర్షెన్ వస్తుండటంతో కంపెనీ లోపలికి తీసుకెళ్ళిన మంత్రిగేటు బయటికి మీడియాను పంపించి బాధితులతో మాట్లాడారు. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్‌ నేతలు మరోసారి పరిశీలిస్తున్నారు. మంత్రి దామోదర, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, జగ్గారెడ్డి తదితరులు ఘటనపై ఆరా తీశారు.ఘటన స్థలం లో మంత్రి దామోదరను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  దీంతో  మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రమాదంలో 13 మంది మిస్సింగ్‌


ప్రమాదంలో 13 మంది ఆచూకీ లభించలేదు. దీంతోవారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మిస్సయిన వారిలో సుభదీప్‌ సర్కార్‌, సిద్ధార్థ గౌడ్‌, లక్ష్మీముఖ్య, శ్యాంసుందర్‌, తస్లిముద్దీన్‌, ప్రశాంత్‌,  జేపీ పటేల్‌, వెంకటేషం, అఖిల్‌, ప్రవీణ్‌ కుమార్‌, బాలకృష్ణ, చోటే లాల్‌, రామాంజనేయులు ఉన్నారు.

సిగాచి యాజమాన్యంపై సర్కార్‌ సీరియస్‌

సిగాచి యాజమాన్యం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఘటన స్థలానికి చేరుకొని సిగాచి ఎండీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.నిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు సీఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సిగాచి ఎండీ హైదరాబాద్ కి రాకపోవడం తో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి వార్నింగ్ ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

నిలిచిపోయిన సహాయక చర్యలు

పాశమైలారంలో సహాయక చర్యలు  నిలిచిపోయాయి.శిథిలాలను తొలగించడానికి  పలు అడ్డంకులు ఎదురవుతు న్నాయి.సగం కూలిన భవనం కిందకి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టడం కష్టసాధ్యంగా మారింది.  ఏ క్షణంలో భవనం కూలుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.పేలుడు ధాటికి సగం భవనం కుప్పకూలింది. ఇంకా ఇప్పటి వరకు 17 మంది సిగాచి కంపెనీ కార్మికుల ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. దీంతో కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు 37 మంది చనిపోయారు. మరో 34 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 36 మృతదేహాలు పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు.వీటిలో 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 25 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన సిబ్బంది ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచారు.

మృతదేహల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు శాంపిల్స్ ను సేకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి మరో 36 గంటల సమయం పట్టే అవకాశం.రిపోర్ట్ ఆధారంగా డెడ్‌ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది...ఇప్పటికే పాశమైలారం సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేసిన పోలీసులు BNS లోని 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు BDL భానుర్ పోలీసులు.


పొంతన లేని మృతుల సంఖ్య..


సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య పొంతన లేకుండా పోయింది. ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్టుగా రెస్క్యూ టీమ్ చెబుతుండగా, అధికారికంగా 39 మంది అని కలెక్టర్ వెల్లడించారు. మాకు 35 మృతదేహాలే హ్యాండ్ ఓవర్ చేశారంటున్న పటాన్ చెరువు ఆసుపత్రి సిబ్బంది. మరి మిగతా వారు ఎక్కడ?. అనే విషయంలో పొంతన లేకుండా పోయింది.

 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి


పోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం పూర్తయిన వారిలో 1.రాజనాల జగన్మోహన్, ఒరిస్సా. 2.రామ్ సింగ్ రాజ్ బార్, యూపి3.శశి భూషణ్ కుమార్, బీహార్,4.లగ్నజిత్ దావూరి, ఒరిస్సా,5.హేమ సుందర్, చిత్తూరు. 6.రక్సూనా ఖాతూన్, బీహార్,7.నిఖిల్ రెడ్డి, కడప,8.నాగేశ్వరరావు, మంచిర్యాల, 9.పోలిశెట్టి ప్రసన్న, ఈస్ట్ గోదావరి,10.శ్రీ రమ్య, కృష్ణా జిల్లా,11. మనోజ్ , ఒరిస్సా కు చెందినవారు ఉన్నారు.


Advertisment
Advertisment
తాజా కథనాలు