Vivo T4 Lite 5G: ఖతర్నాక్.. AI ఫీచర్స్, 50MP కెమెరా వివో ఫోన్ పై అదిరిపోయే ఆఫర్లు - ఫీచర్లు సూపరెహే!

Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ సేల్ ఇవాళ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. 4/128GB ధర రూ.9,999, 6/128GB ధర రూ.10,999, 8/256GB ధర రూ.12,999కు లభిస్తుంది. దీనిపై రూ.500 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఇది 50mp కెమెరా, 6,000mAh బ్యాటరీ, AI ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

New Update
Vivo T4 Lite 5G sale started today on flipkart

Vivo T4 Lite 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ వివో కొత్త కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికి చాలా ఫోన్లను దేశీయ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 24న భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB వేరియంట్లు ఉన్నాయి. ఇది MediaTek Dimensity 6300 SoC, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. 

Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Vivo T4 Lite 5G price and offers

భారతదేశంలో Vivo T4 Lite 5G మొబైల్ బేస్ వేరియంట్ 4GB + 128GB ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 6GB + 128GB వేరియంట్ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే దీని టాప్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 12,999 ధరకు లభిస్తుంది. ఇది ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ షేడ్స్‌లో వస్తుంది. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

Vivo T4 Lite 5G bank offers

దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI, HDFC లేదా Axis బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత వీటి ధరలు వరుసగా 4GB రూ. 9,499, 6GB రూ. 10,499, 8GB రూ. 12,499 ధరకి లభిస్తాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Vivo T4 Lite 5G specifications

Vivo  T4 Lite 5G  స్మార్ట్ ఫోన్ 6.74-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. Android 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా FuntouchOS 15పై నడుస్తుంది. Vivo T4 Lite 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 

ఈ ఫోన్ AI ఫోటో ఎన్‌హాన్స్, AI ఎరేస్ వంటి ఇమేజింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా Vivo T4 Lite 5G ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్ తో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ను కలిగి ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు