/rtv/media/media_files/2025/07/02/kolkata-high-court-gave-big-shock-to-shami-2025-07-02-13-33-03.jpg)
Kolkata High Court Gave Big Shock To Shami
భారత క్రికెటర్ షమీకి కోల్‌కతా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ భార్య, కూతురుకు ఖర్చులకోసం ప్రతినెల రూ. 4 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. హసిన్ జహాన్‌ను 2014లో షమీ పెళ్లి చేసుకోగా కొంతకాలానికి ఇరువురి మధ్య విభేధాలు మొదలయ్యాయి. దీంతో 2018లో షమీపై ఆమె గృహహింస కేసు పెట్టింది. అప్పటినుంచి కూతురితో కలిసివుంటున్న జహాన్.. భరణంకోసం 2023లో జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యకు 50వేలు, కూతురికి 80 వేలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది.
Also Read : గుండెపోటుకు కొవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు: కేంద్రం
Kolkata High Court Big Shock To Shami
🚨 Calcutta High Court orders 🇮🇳 cricketer Mohammed Shami to pay ₹4 lakh/month ALIMONY: ₹1.5L to ex-wife Hasin Jahan, ₹2.5L to daughter Aaira.
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 2, 2025
— Calcutta High Court ruled the earlier amount was too LOW, citing Shami’s income 🤯 pic.twitter.com/djlGIJGeic
Also Read : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
అయితే ఇటీవల ఆ తీర్పును సవాల్ చేస్తూ జహాన్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రతి నెలా తనకు 7 లక్షలు, కూతురికి 3 లక్షలు ఇవ్వాలని పిటీషన్ వేసింది. దీనిపై తాజాగా విచారించిన జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ బెంచ్.. భార్యకు నెలా 1.5 లక్షలు, కూతురుకు 2.5 లక్షలు ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ప్రతి నెలా నాలుగు లక్షల మెయింటేనెన్స్ ఇవ్వడం వల్ల వారికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని న్యాయస్థానం పేర్కొంది. కూతురు చదువు కోసం లేదా ఇతర ఖర్చుల కోసం షమీ డబ్బులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. వీరికి 2014లో పెళ్లి జరగగా 2015లో కూతురు పుట్టింది.
Also Read : పేదల సేవలో చంద్రన్న.. అభాగ్యులతో ఆప్యాయంగా ముఖాముఖి! ఫొటోలు చూశారా
Also Read : మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
mohammad-shami | kolkata-high-court | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu-sports-news | telugu-cricket-news