Father: ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం

కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

New Update
Father who tortured his daughter

Father who tortured his daughter

 Father: కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి సమయానికి నిద్రపోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్‌తో కాల్చడంతో పాటు తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం వైరల్‌ కావడంతో  ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?

తల్లిలేని సమయంలో బాలికను తీవ్రంగా కొడుతున్నట్లు ఆ తల్లి గుర్తించింది. దానికి సంబంధించిన వీడియోను తల్లి చూడటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన కుమార్తెపై దాడి చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. ఆ కసాయి తండ్రి తన కూతురి కాళ్లను కట్టివేసి, ఆమెపై దాడి చేసి, సిగరేట్‌తో ఆమె చెంపపై కాల్చినట్లు కనిపిస్తోంది. తల్లి నుంచి  ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను రెస్క్యూ చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తండ్రిని విచారించడంతో బాలిక టైంకు నిద్రపోకపోవడంతో ఆమెను హింసించినట్లు తండ్రి వివరించినట్లు తెలిసింది.

Also Read : AP Home Minister Anita: అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

Advertisment
Advertisment
తాజా కథనాలు