/rtv/media/media_files/2025/07/02/e-formula-race-2025-07-02-16-57-07.jpg)
E Formula Race Case:
తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ- కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్(IAS Aravind Kumar) విచారణకు హాజరుకావాలని మరోసారి ఏసీబీ నోటీసులు(ACB Notices) జారీ చేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నాలుగోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు పంపింది.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ గత నెల 30వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పటికే అరవింద్ కుమార్‌ను మూడు సార్లు విచారించగా.. మళ్లీ నాలుగోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసు(ktr e formula race)లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్-, A3గా బీఎల్‌ఎన్ రెడ్డి- లు ఉన్నారు.