/rtv/media/media_files/2025/07/02/tamil-nadu-crime-newly-wed-committed-suicide-2025-07-02-12-48-57.jpg)
tamil nadu crime newly wed comitted suicide
Crime: తమిళనాడులో మరో ఘోరం జరిగింది. పెళ్ళైన నాలుగు రోజులకే వరకట్న వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి గ్రామానికి చెందిన లోకేశ్వరి అనే యువతికి జూన్ 27న పన్నీర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కాపురానికి వెళ్లిన రోజు నుంచే లోకేశ్వరికి వేధింపులు మొదలయ్యాయి. 5 తులాల బంగారం, బైక్, ఏసీ తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేశారు. దీంతో వధువు కుటుంబం 4 తులాల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటికి వేధింపులు ఆగలేదు. మిగతా తులం కోసం ఆమెను టార్చర్ చేశారు. ఈ క్రమంలో జూన్ 30న పుట్టింటికి వెళ్లిన లోకేశ్వరి.. వేధింపులు తట్టుకోలేక అక్కడే ఉరేసుకొని చనిపోయింది.
ఇటీవలే మరో దారుణం!
ఇదిలా ఇటీవలే తమిళనాడులోని తిరుప్పూర్‌లో అదనపు వరకట్న వేధింపులు తట్టుకోలేక రిధన్య అనే యువతి పెళ్ళైన 2 నెలలకే పురుగుల మంది తాగి చనిపోయింది. రిధన్య తల్లిదండ్రులు అల్లుడు కవిన్ కుమార్ కి 800 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ. 70 లక్షల విలువైన వోల్వో కారు అల్లుడికి కట్నం కింద ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి ఆశ తీరలేదు. పెళ్ళైన కొద్దిరోజుల నుంచి భార్యను రోజు అదనపు కట్నం కోసం వేధించాడు. కవిన్ తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా రిధన్యను వేధింపులకు గురిచేశారు. దీంతో రిధన్య తట్టుకోలేక జులై 4న పురుగుల మందు తాగి చనిపోయింది.
ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలోనే తన కారును ఆపి కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చాలా సేపు ఆ ప్రాంతంలో కారు నిలిపి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే రిధన్య చనిపోయే ముందు తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో సందేశాలను పంపినట్లు సమాచారం. భర్త కవిన్ కుమార్, అత్త చిత్రాదేవి, మామ ఈశ్వరమూర్తి, తనను శారీరకంగా, మానసికంగా హింసించారని, తాను ఇక జీవించలేనని, వేరే జీవితం వెతుక్కునే ఓపిక కూడా లేదని ఆమె ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Ananya Nagalla: మోడ్రన్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న తెలంగాణ పోరి! ఫొటోలు చూశారా?