/rtv/media/media_files/2025/07/02/elon-musk-and-trump-2025-07-02-08-28-25.jpg)
Elon Musk And Trump
ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఎలాన్ మస్క్ విమర్శించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా హెచ్చరించాడు. దుకాణం సర్దేసుకుని దక్షిణాఫ్రికా వెళ్లిపోతావ్ జాగ్రత్త అంటూ తీవ్రంగా స్పందించాడు. కాగా దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ ‘దీన్ని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉంది. చాలా చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఏమీ చేయదల్చుకోలేదు’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన మస్క్ వెనక్కి తగ్గాడు.
Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
Elon Musk V/s Donald Trump
కాగా మస్క్‌ను ఉద్దేశించి ట్రంప్ ‘చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా మస్క్ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్ ప్రయోగాలు ఉండవు, శాటిలైట్లు ఉండవు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. ఎలాన్ మస్క్ తన దుకాణం మూసుకుని సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. అమెరికాకు ఎంతో సంపద మిగులుతుంది’’ అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు పెట్టడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే ‘డోగె’ విభాగం ఎలాన్ మస్క్‌కు అందుతున్న సబ్సిడీల వ్యవహారంపై దృష్టిసారించాలని కోరారు. దీంతో స్పందించిన మీడియా ‘ట్రంప్‌ను దేశం నుంచి వెళ్లగొట్టే ఆలోచన ఏదైనా ఉందా?’ అంటూ ప్రశ్నించింది. అయితే ‘ఇప్పటికైతే తెలియదు.కానీ ఈ అంశంపై మేం దృష్టిపెట్టాల్సి ఉంది’ అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read : పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు!
Also Read : వారికి ప్రతి నెలా రూ.4 లక్షలు ఇవ్వండి.. షమీకి హైకోర్టు ఆదేశాలు!
ట్రంప్ తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ ఖర్చులను, సబ్సిడీలను తగ్గించేందుకుఈ బిల్లు ఉద్దేశించింది. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లును సమర్థించే ప్రజా ప్రతినిధుల పదవులు ఊడగొడతానని మస్క్ హెచ్చరించాడు. దీంతో ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఎలాన్ మస్క్ కంపెనీలు టెస్లా, స్పేస్ ఎక్స్‌లకు అందే సబ్సిడీల అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. ఈ విషయమై స్పందించిన ఎలాన్‌మస్క్‘‘నేను సూటిగా చెబుతున్నాను. వెంటనే సబ్సిడీలన్నింటికీ కోత పెట్టేసుకోండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతేకాదు తను పార్టీ పెట్టబోతున్నట్లు మరోసారి ప్రకటించారు.దేశంలో ఏకపార్టీ పాలన ఉందన్న మస్క్ ఇప్పుడు దేశంలో ప్రజా సంక్షేమాన్ని నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పేర్కొన్నారు.
Also Read : వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!
Donald Trump | anti trump protest | america president trump | Elon Musk - Trump | elon musk X post | elon musk latest news