INS Tamal: రష్యా నుంచి ఇండియన్‌ నేవీలోకి INS తమల్‌

రష్యాలోని కాలివిన్‌గ్రాడ్‌లో INS తమల్‌ జలప్రవేశం చేసింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతో రష్యా ఇండియాకు ఇది రూపొందించింది. అరేబియా, సౌత్‌ హిందూ మహాసముద్రంలో INS తమల్ కాపలా కాయనుంది. రష్యాలో 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు విజయవంతమయ్యాయి.

New Update
INS tamal

రష్యాలోని కాలివిన్‌గ్రాడ్‌లో INS తమల్‌ జలప్రవేశం చేసింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతో రష్యా ఇండియాకు INS తమల్‌ రూపొందించింది. అరేబియా, సౌత్‌ హిందూ మహాసముద్రంలో ఇది పహారా కాయనుంది. INS తమల్‌కు రష్యాలో 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు విజయవంతమయ్యాయి. రష్యా ప్రాజెక్ట్ 1135.6 క్రివాక్ క్లాస్ డిజైన్ ఆధారంగా దీన్ని రూపొందించింది. INS తమల్ మల్టీ-రోల్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. దీని పొడవు 125 మీటర్ల, బరువు  3900 టన్నులు. ఈ నౌకలో రాడార్‌లకు కూడా కనిపించకుండా ఉండే స్టెల్త్ డిజైన్‌ కలిగి ఉంది. 

INS తమల్‌ యుద్ధనౌకలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి.
1. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ మిస్సైల్స్‌ (450 కి.మీ.) 
2. ష్టిల్-1 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు.
3. 100 MM నావల్ గన్, AK-630 సిస్టమ్.
4. యాంటీ-సబ్‌మెరైన్ టార్పెడోలు, రాకెట్ లాంచర్లు
5. వర్టికల్‌ లాంచ్‌ షార్ట్‌ రేంజ్‌, ఎయిర్‌ టూ ఎయిర్‌ మిస్సైల్స్‌
6. మీడియా రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ 

క్రూయిజ్‌, హెలికాప్టర్లు, బాలిస్టిక్‌ క్షిపణి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం INS తమల్‌కు ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్స్‌, కమ్యూనికేషన్ సిస్టమ్స్.. టార్గెట్ డిటెక్షన్ సెన్సార్లతో యుద్ధనౌకలో 26% స్వదేశీ భాగాలు ఉన్నాయి. భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం INS తమల్‌కు ఉంది. డ్రోన్లు, సబ్‌మెరైన్‌లు, ఫైటర్ జెట్‌లు F-16, F-35 నుంచి స్వతహాగా రక్షించుకోగలదు.  INS తమల్‌ ఆధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఇక చైనా, పాక్‌ నావల్ శక్తికి ప్రతిబలంగా తయారైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు