Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నది.

New Update
Sheikh Hasina

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయింది షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. 

ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే ఆమెకు జైలు శిక్ష ఖరారైంది. 

Advertisment
తాజా కథనాలు