/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
Medaram jatara-2026
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జరగనుంది. ప్రతి రెండు సంవ్సరాలకు ఒకసారి జరిగేఈ జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకుఈ జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు సంబంధించిన వివరాలను పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారు. 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది.
Also Read : డీహైడ్రేషన్... నో టెన్షన్.. దాని లక్షణాలేంటో తెలుసుకుందాం
Also Read : బుమ్రాపై స్టోక్స్ షాకింగ్ కామెంట్స్.. 0తో సమానం అంటూ!
జాతర తేదీలు ఇవే...
2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత,
29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.
30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట,
31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం
Also Read : పట్టపగలే దారుణ హత్య.. ప్రియురాలిని నరికి చంపిన మాజీ ప్రియుడు
Also Read : గుండెపోటుకు కొవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు: కేంద్రం
medaram sammakka sarakka | medaram sammakka sarakka jatara | medaram-jatara | medaram-festival