IND VS ENG 2ND TEST: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియా జట్టులో భారీ మార్పులు

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ సెకండ్ టెస్ట్ జరుగుతుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 

New Update
England have won the toss and elected to bowl

England have won the toss and elected to bowl first

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈరోజు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా ప్రస్తుతం సిరీస్‌లో 1-0తో వెనుకబడి ఉంది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 

Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

టీం ఇండియా జట్టు

యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

ఇంగ్లాండ్ జట్టు

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

టీం ఇండియాలో 3 మార్పులు

టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో 3 మార్పులు జరిగాయి. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, ఆకాశ్‌దీప్‌లకు అవకాశం కల్పించారు. 

ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్‌లో టీం ఇండియా రికార్డు చాలా దారుణంగా ఉంది. ఈ గ్రౌండ్‌లో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

ఈ మ్యాచ్‌లో అందరి చూపు రిషబ్ పంత్ పైనే ఉంది. ప్రస్తుతం రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు