Tamilnadu: జై భీమ్ సినిమా రిపీట్.. సెక్యూరిటీ గార్డును కొట్టి చంపిన పోలీసులు!

తమిళనాడులో పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక సెక్యూరిటీ గార్డు అజిత్ మృతి చెందాడు. కాళీ అమ్మన్ ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ ఆలయంలో ఆభరణాలు దొంగతనం చేశారనే ఆరోపణలో పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా కొట్టడంతో లాకప్‌లో మృతి చెందాడు.

New Update
Tamilnadu

Tamilnadu

తమిళనాడులో జై భీమ్ సినిమా సీన్ రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక సెక్యూరిటీ గార్డు అజిత్ మృతి చెందాడు. అజిత్ కాళీ అమ్మన్ ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఆలయంలో ఆభరణాలు దొంగతనం చేశారనే ఆరోపణలు రావడంతో అజిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా అజిత్‌ను తీవ్రంగా పోలీసులు కొట్టారు.

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

శరీరంపై 44 గాయాలు..

వారి దెబ్బలు తట్టుకోలేక లాకప్‌లోనే మృతి చెందాడు. ప్రైవేట్ పార్స్ట్‌తో పాటు నోరు, చెవుల్లోనూ కారం వేసి దారుణంగా కొట్టారు. అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలా కస్టడీలో ఉన్నప్పుడు మృతి చెందడంతో మద్రాసు హైకోర్టు పోలీసులపై సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను అరెస్టు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు.

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

Advertisment
తాజా కథనాలు