Ramayana Glimpse:'రామాయణం' ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్..! భారీగా ఏర్పాట్లు

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. జులై 3న మూవీ గ్లింప్స్, టైటిల్ లోగోను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

New Update
Bollywood Ramayana Glimpse Update

Bollywood Ramayana Glimpse Update

Ramayana Glimpse: రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు జులై 3న మూవీ గ్లింప్స్, టైటిల్ లోగోను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో జరగనున్న భారీ ఈవెంట్ లో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్. ఈ ఈవెంట్ కి చిత్రబృందమంతా హాజరుకానున్నారు.  అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆశ్చర్యపరుస్తుంది!

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి  ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే గ్లింప్స్ వీడియోతో పాటు 7 నిమిషాల 'విజన్ షోరీల్'ని చూసిన ఆయన సోషల్ మీడియాలో తన రియాక్షన్ పంచుకున్నారు.

తరణ్ ఆదర్శ్ ఇలా రాశారు.. జై శ్రీరామ్  అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇతిహాసం ''రామాయణం''  మొదటి గ్లింప్స్‌తో పాటు 7 నిమిషాల విజన్ షోరీల్‌ను ఇప్పుడే చూశాను. ఈ అద్భుతమైన కథ  గ్లింప్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది!. 'రామాయణం' కేవలం ఈ రోజు కోసం తీసిన సినిమా కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా... బాక్సాఫీస్ తుఫాను రాబోతోంది! చిత్రబృందానికి శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ ట్వీట్ సినిమాపై  అంచనాలను మరింత పెంచింది. 

మొదటి భాగం దీపావళికి

నితీష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించారు. అలాగే  సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, లారా దత్త కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కనిపించనున్నారు. 'రామాయణం' రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఆస్కార్ విజేత  VFX స్టూడియో DNEG ఈ సినిమా విజువల్స్ కోసం పనిచేసింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
తాజా కథనాలు