/rtv/media/media_files/2025/07/02/kabaddi-player-brijesh-solanki-died-due-to-dog-bite-2025-07-02-18-13-50.jpg)
Kabaddi player Brijesh Solanki died due to dog bite
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోరమైన విషాదం జరిగింది. కుక్క కాటు వేయడంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ మృతి చెందాడు. చెట్టంత కొడుకు కళ్లముందే గిల గిలా కొట్టుకుని చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
Kabaddi player Brijesh Solanki
అతడి పేరు బ్రజేష్ సోలంకి. బులంద్‌షహర్‌లోని ఖుర్జా నగర్ కొత్వాలి ప్రాంతం ఫరానా గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. గత నెలలో ఒక కుక్కపిల్ల కాలువలో పడిపోయింది. ఆ సమయంలో బ్రజేష్ దాన్ని బయటకు తీయడానికి కాలువలోకి దిగాడు. అప్పుడే ఆ కుక్క పిల్ల అతడి కుడి చేతి వేలును కొరికింది. ఆ తర్వాత బ్రజేష్ దానిని నిర్లక్ష్యం చేశాడు. ఎలాంటి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోలేదు.
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
मौत से पहले तड़पता यह व्यक्ति कोई और नहीं बल्कि बुलंदशहर का स्टेट लेवल कबड्डी प्लेयर बृजेश सोलंकी है। कुछ दिन पहले एक पिल्ले को बचाने के दौरान पिल्ले ने उसे काट लिया था। बृजेश ने लापरवाही बरती और रेबीज का इंजेक्शन नहीं लगवाया। ऐसे में रेबीज शरीर में फैलने से गोल्ड मेडलिस्ट ब्रजेश… pic.twitter.com/nhSZk52JvE
— SANJAY TRIPATHI (@sanjayjourno) July 2, 2025
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
దీంతో రోజు రోజుకు అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. క్రమక్రమంగా బ్రజేష్‌లో రేబిస్ లక్షణాలు కనిపించాయి. తల్లిదండ్రులు ఒక దాని తర్వాత ఒకటి వరుసగా హాస్పిటల్స్‌కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు చేతులెత్తేశారు. ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఆలస్యమైందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఏం చేయాలో తెలియక.. తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అతడిని మంచం మీద పడుకోబెట్టారు. అక్కడ నొప్పితో విలవిల్లాడుతూ బ్రజేష్ మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రుల, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.