/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
Shamshabad Airport
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మంబాయి -శంషాబాద్ , వైజాగ్ -శంషాబాద్, జైపూర్ -శంషాబాద్ విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం నుంచి ప్రతికూల వాతావరణం నెలకొంది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలు బెంగళూరు, విజయవాడ వైపు వెళ్లాయి. లఖ్‌నవూ, కోల్‌కతా, ముంబయి, జయపుర నుంచి వచ్చే వాటిని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు.
Also Read: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. శంషాబాద్ లోనూ గాలులతో పాటు వాన పడటంతో విమానాల ల్యాండింగ్ వాతావరణం అనుకూలించలేదు. దీంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన పలు ఫ్లైట్లను దారి మళ్లించారు. మంబాయి -శంషాబాద్ , వైజాగ్ శంషాబాద్, జైపూర్ -శంషాబాద్ విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
ఇది కూడా చదవండి:అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
ఎయిర్ ట్రాఫిక్ జామ్..
కాగా రెండు రోజుల క్రితమే శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. దీంతో విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది. ఇండిగో విమానం పూణె నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.
ఆదివారం ఉదయం పూణె నుంచి ఉదయం 8.43 గంటలకు బయలుదేరిన విమానం ఉదయం పది గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉంది. అయితే భారీగానెలకొన్న ఎయిర్ ట్రాఫిక్ తో విమానం ల్యాండింగ్ కు అవకాశం లేకపోవడంతో విజయవాడకు మళ్లించారు. అక్కడి నుంచి రెండు గంటల తర్వాత మధ్యాహ్నం 12.38 గంటలకు శంషాబాద్ చేరుకుంది. దీంతో ప్రయాణికులు రెండు గంటల ఆలస్యంగా తమ గమ్యస్థానాలకుచేరుకోవాల్సి వచ్చింది.
Also Read : AP Home Minister Anita: అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత