/rtv/media/media_files/2025/06/20/ind-vs-eng-test-series-2025-2025-06-20-10-20-55.jpg)
IND VS ENG TEST SERIES 2025
ఇంగ్లాండ్-ఇండియా మధ్య నేటినుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ గ్రౌండ్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో భారత్ 7 ఓడిపోగా 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో ఈసారైనా గెలుపు రుచి చూస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ మైదానంలో తిరుగులేని ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
ఇది కూడా చదవండి:అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
Ind vs Eng Second Test Match
మొదటి టెస్టు విజయంతో ఊపుమీద కనిపిస్తున్న ఇంగ్లాండ్ జట్టు.. మరింత ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తుది జట్టును ముందే ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తుండగా.. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్‌తో ఆ జట్టు లైనప్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు ఇండియా తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. కానీ భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : పాకిస్థాన్ నటినంటూ పరిచయం.. రూ.21.74 లక్షల టోకరా
ఇంగ్లాండ్:
బెన్ స్టోక్స్(కెప్టెన్) క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బ్రూక్, , స్మిత్, వోక్స్, కార్స్, జోష్ టంగ్, బషీర్.
Also Read : AP Home Minister Anita: అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత
భారత్ (అంచనా):
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పంత్, కరుణ్ నాయర్, జడేజా, వాషింగ్టన్ సుందర్/కుల్‌దీప్, బుమ్రా/అర్ష్‌దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
ind-vs-eng | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news | ben-stokes | shubman-gill