Crime News: పట్టపగలే దారుణ హత్య.. ప్రియురాలిని నరికి చంపిన మాజీ ప్రియుడు

రాజస్థాన్‌లో లీలా తబియార్‌కు తన భర్తతో విడాకులు కావడంతో మహిపాల్ అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు సహజీనవం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహిపాల్ లీలాపై దాడి చేశాడు. రెండేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవల బయటకు రాగా ఆమెను నడిరోడ్డుపై నరికి చంపాడు.

New Update
Rajastan

Rajastan

ఈ మధ్య కాలంలో దారుణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. భాగస్వామి ఇతరులతో రిలేషన్‌లో ఉన్నారని, ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని ఇలాంటి కారణాల వల్ల హత్య చేస్తు్న్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్‌లో జరిగింది. పట్ట పగలు నడి రోడ్డుపై మాజీ ప్రియుడు ప్రియురాలిని నరికేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కి చెందిన లీలా తబియార్(36) అనే మహిళ ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తుంది.

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో..

తబియార్‌కు తన భర్తతో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత మహిపాల్ అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు సహజీనవం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహిపాల్ లీలాపై దాడి చేశాడు. దీంతో రెండేళ్ల పాటు జైలులో ఉన్నాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన మహిపాల్ లీలాను నడిరోడ్డుపై నరికి నరికి చంపాడు. బన్స్వారా జిల్లా కలింజర బస్‌స్టాండ్‌లో అందరూ చూస్తుండగానే మాజీ ప్రియురాలిని నరికి చంపాడు. ఆమె వెంటనే మృతి చెందింది. పోలీసులు 6 ప్రత్యేక బృందాలుగా మారి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

Advertisment
Advertisment
తాజా కథనాలు