/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అతని సోదరుడి ఇంట్లో కూడా ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ వేటు వేసింది. శివ బాలకృష్ణను 2024 జనవరిలో సస్పెండ్ చేస్తూ హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.