అమెరికాలో దొరికిపోయిన 10,382 మంది భారతీయులు

అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. అమెరికా అక్రమ వలస వెళ్తూ ఈ ఏడాది జనవరి-మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. వీరిలో 30 మంది మైనర్లు ఉన్నారు. అత్యధికంగా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారున్నారు.

New Update
illegal immigrants In US

అమెరికాకి అక్రమ వలస వెళ్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. వీరిలో 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన వారిలో అత్యధికంగా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ డేటాను అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టులు చేస్తున్నారు.

గతేడాది ఇదే సీజన్‌లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఈ లెక్కన 2025లో సుమారు 70శాతం తగ్గుదల నమోదైంది. రోజుకు సగటున 69 మంది అరెస్ట్‌ అయ్యారు. ఇదే జోబైడెన్‌ హయాంలో రోజుకు 230 వరకు అరెస్ట్‌ అయ్యేవారు. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను అమెరికా చేర్చే గ్యాంగ్‌లు తమ కార్యకలాపాలను తగ్గించాయి. 

2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన 500 మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. -మెక్సికో, కెనడా సరిహద్దుల్లో చాలా మంది తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లేవారు. కానీ, ట్రంప్‌ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలేయడంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయస్సు 12 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటోంది. ఏప్రిల్‌ 2024 నాటికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 332 మందిని అక్కడి నుంచి వెనక్కి పంపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు