Israel: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ: ట్రంప్‌ పోస్టు

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.

New Update
israel

Attacks On Gaza

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు. ఈ మేరకు ‘గాజాకు సంబంధించి ఇజ్రాయెల్‌తో మా ప్రతినిధులు సుదీర్ఘమైన, విజయవంతమైన చర్చలు జరిపారు. 60 రోజుల కాల్పుల విరమణ ఖరారు చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. ఈ సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంతంలో శాంతికోసం కృషి చేస్తున్న ఖతార్‌, ఈజిప్ట్‌లు తుది ప్రతిపాదన చేస్తాయి. ఇది పశ్చిమాసియాకు మంచిదని ఆశిస్తున్నాం' అన్నారు.

ఇది కూడా చదవండి: అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి

Also Read :  హైదరాబాద్ వచ్చే విమానంలో సాంకేతిక లోపం.. భయంతో 222 మంది ప్రయాణికులు

Israel Agreed Ceasefire In Gaza

ఇక హమాస్‌ సైతం ఈ డీల్‌కు ఒప్పుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఒక వేళ హమాస్‌ అంగీకరించకుంటే ఈ సమస్య మరింత జటిలం అవుతుందని ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. అయితే ట్రంప్‌ చేసిన ప్రకటనకు సంబంధించి హమాస్‌ అంగీకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

Also Read :  ఏపీలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

Also Read :  ‘దిల్ రాజ్‌ ఇంకోసారి అలా చేస్తే’.. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..

 

Donald Trump | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు