'ఐలవ్‌ యూ' చెప్పడం లైంగిక వేధింపు కాదు: హైకోర్టు

మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 అక్టోబర్‌లో 11వ తరగతి చదువుతున్న మైనర్ కూతురికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పి, లైంగికంగా వేధించాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Gu04uhDWQAAyCbt

Mumbai: మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 అక్టోబర్‌లో 11వ తరగతి చదువుతున్న మైనర్ కూతురికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పి, లైంగికంగా వేధించాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు అతనికి 3ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమాన విధించింది.  

అయితూ నాగ్ పూర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ముంబై కోర్టు.. అతని నోటి నుండి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. అతను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడట్టు ఆధారాలు లేవని, నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేవేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు