/rtv/media/media_files/2025/07/02/peter-henry-schroede-2025-07-02-13-03-23.jpg)
peter henry schroede
హాలీవుడ్ స్టార్ నటుడు పీటర్ హెన్రీ స్ట్రోడర్ (90) ఫ్లోరిడాలో కన్నుమూశారు. హెన్రీ మృతి చెందడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్ట్రోడర్ కేవలం వెండితెరపైనే కాదు, దేశ సైన్యంలో కూడా పనిచేశారు. నిజ జీవితంలో కూడా సేవలు అందించి హెన్రీ రియల్ హీరోగా నిలిచారు. అనారోగ్య సమస్యల కారణంగా హెన్రీ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే హెన్రీ అంత్యక్రియలు లాస్ ఏంజిల్స్‌లో సైనిక లాంఛనాలతో అత్యంత గౌరవప్రదంగా జరిగాయి.
ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
Peter-Henry Schroeder, a veteran character actor best known to Star Trek fans for his role in Star Trek: Enterprise, Peter-Henry as Gunslinger, has died at the age of 90.😢 pic.twitter.com/azhB2D4R1y
— Sumner (@renmusb1) July 2, 2025
ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
కన్నీటి వీడ్కోలు..
దేశం పట్ల ఆయన చేసిన సేవలకు, ఆయన చూపిన నిబద్ధతకు గుర్తింపుగా నిర్వహించారు. అతనికి సైనిక గౌరవాలతో వీడ్కోలు పలికారు. స్ట్రోడర్ కేవలం ఒక నటుడిగానే కాదు, దేశభక్తుడిగా, ప్రతిభావంతుడైన నిర్మాతగా కూడా హాలీవుడ్‌లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పోషించిన పాత్రలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రపంచ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఇది కూడా చూడండి: Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!
Peter-Henry Schroeder Dies: 'Argo' & 'Star Trek' Character Actor Was 90 https://t.co/SYXN65oLJP
— Deadline (@DEADLINE) July 1, 2025
ఇది కూడా చూడండి: Sigachi Company: పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం