/rtv/media/media_files/2025/07/02/madhya-pradesh-murder-2025-07-02-09-06-07.jpg)
Madhya Pradesh murder
Crime : మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. ఆసుపత్రి నిండా జనం ఉండగానే, అందరూ చూస్తుండగానే ఒక యువతిపై దాడి చేసిన యువకుడు యువతి గొంతుకోసి హత్య చేయడం సంచలనం సృష్టించింది. ట్రామా వార్డులో నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, పేషేంట్ల సహాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ యువకున్ని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు.
ఇది కూడా చదవండి: అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
Young Man Slits Throat
యువతి గొంతు కోస్తున్న యువకున్ని అడ్డుకోకపోగా దానిని కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీయటం గమనార్హం. 10 నిమిషాల పాటు యువతిపై యువకుడు దాడి చేస్తుపన్నప్పటికీ ఎవరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనలో సంధ్యా చౌదరి అనే యువతి దుర్మరణం పాలయ్యాడు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా నిందితుడు అభిషేక్ కోష్టి గా గుర్తించారు.
Also Read : పాకిస్థాన్ నటినంటూ పరిచయం.. రూ.21.74 లక్షల టోకరా
Also Read : వారికి ప్రతి నెలా రూ.4 లక్షలు ఇవ్వండి.. షమీకి హైకోర్టు ఆదేశాలు!
ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీకెమెరాలో నమోదైన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సంధ్యా చౌదరి తన స్నేహితురాలి వదినను పరామర్శించడానికి నర్సింగ్‌పూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన అభిషేక్ కోష్టి కూడా అక్కడికి వచ్చాడు. అనంతరం ఇద్దరు కొంత సేపు మాట్లాడుకున్నారు. అయితే అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.దీంతో కోపంతో రగిలిపోయిన నిందితుడు ఆమెను కొట్టి నేలపై పడేసి, ఆమె ఛాతిపై కూర్చుని గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సంధ్యా రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ ఆ పక్కనుంచే నడుచుకుంటూ పోయారే తప్ప ఆమెను పట్టించుకోలేదు. తర్వాత నిందితుడు అదే కత్తితో తన గొంతు కోసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో బైక్ తీసుకుని పారిపోయాడు.
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
crime news | young-man | young man case | madyapradesh