Bombay High Court: అలా చేస్తే లైంగికంగా వేధించినట్లు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. మైనర్ అమ్మాయికి I love you చెప్పినంత మాత్రాన వేధింపులకు గురి చేసినట్లు కాదని తేల్చి చెప్పింది. ఓ యువకుడి కేసులో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

New Update
Bombay High Court sensational verdict saying i love you is not sexual harassment

Bombay High Court sensational verdict saying i love you is not sexual harassment

బాంబే హైకోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. మైనర్ అమ్మాయికి I love you చెప్పినంత మాత్రాన.. వేధింపులకు గురి చేసినట్లు కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

ఐలవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు

2015 అక్టోబర్ లో ఓ యువకుడు 11వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు ఐ లవ్ యూ చెప్పాడు. ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తమ మైనర్ కూతురికి ఒక యువకుడు ఐ లవ్ యూ చెప్పి లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

దీంతో ఈ కేసుపై విచారించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. 2017 ఆగస్టు నెలలో ఆ యువకుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమాన విధించింది. అంనంతరం నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

ఆ యువకుడి నోటి నుండి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన.. లైంగికంగా వేధించినట్లు కాదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఆ యువకుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టేసింది. అనంతరం ఆ యువకుడికి బెయిల్ ఇచ్చింది. 

Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు