/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
Tirumala Tirupati Devasthanams
జూన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగిసి, తిరిగి పాఠశాలలు ప్రారంభమవడంతో గడచిన నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది. రోజువారిగా చూస్తే సగటున 80వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. జూన్ 14న ఏకంగా 91,720 మంది శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
Also Read: పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
అంతేకాక జూన్‌నెలలో పది రోజులు 80 వేలమందికి పైగా భక్తులు తిరుమలకు వస్తే, ఐదు రోజులు 90వేలమందికి పైగా వచ్చారు. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగిందని ఆలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇక, శ్రీవారి హుండీ ద్వారా రోజుకు సగటున రూ.4 కోట్ల కానుకలు వచ్చాయి. అత్యధికంగా జూన్ 30న రూ.5.30 కోట్ల ఆదాయం లభించింది. అలాగే జూన్‌లో 10.05 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అత్యధికంగా 7వ తేదీన 45,068 మంది తలనీలాలు సమర్పించడం విశేషం. ఇదిలా ఉండగా వేసవిసెలవులు ఉన్న మేనెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెలలో హుండీ ద్వారా రూ.106.83 కోట్ల ఆదాయం లభించింది.
Also Read : నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
భక్తులు అప్రమత్తంగా ఉండాలి : టీటీడీ
తిరుమలకు వచ్చే భక్తులను కొంతమంది మోసం చేస్తున్నారని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనం, సేవల టికెట్లు ఇప్పిస్తామని పలువురిని మోసం చేస్తున్నారు. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు తెలిపారు. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రాస్ అనే ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నఅధికారులు అలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్‌సైట్లను నమ్మవద్దని సూచించారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని కోరారు. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది.
Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
Also Read : ‘దిల్ రాజ్ ఇంకోసారి అలా చేస్తే’.. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..
tirumala-tirupati | tirumala-tirupati-devasthanams | tirumala-tirupati-devasthanam | tirumala-tirupathi | tirumala tirupati temple | tirumala tirupati darshan tickets | ttd