/rtv/media/media_files/2025/07/02/murder-2025-07-02-11-20-28.jpg)
Kurnool: కర్నూల్ జిల్లాలో భయంకరమైన మర్డర్ జరిగింది. సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్న (54) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అనంతరం ఒక కాలు నరికి, దానిని బహిరంగంగాపట్టుకుని బైక్‌పై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన భయంకరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కర్నూలు మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.