/rtv/media/media_files/2025/07/02/actor-fish-venkat-2025-07-02-10-33-29.jpg)
actor fish venkat
Actor Fish Venkat: టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో వారం రోజులుగా వెంటిలేటర్‌పైనే ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఆయనను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
Actor Fish Venkat's health critical
— Telugu Chitraalu (@TeluguChitraalu) July 1, 2025
The actor is currently on ventilator support due to kidney failure. Both his kidneys have reportedly failed, and he has been hospitalized for the past week. Wishing him a speedy recovery. pic.twitter.com/eDKPe7Uo8u
శ్రీహరి సినిమాతో
ఇదిలా ఉంటే ఫిష్ వెంకట్ గతంలో టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో చేశారు. దివంగత నటుడు శ్రీహరి ఆయనను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఆ తర్వాత వి.వి. వినాయక్ వంటి దర్శకులు ఆయనలోని నటనను గుర్తించి, ఆయనకు అవకాశాలు కల్పించారు. ఫిష్ వెంకట్ ఎక్కువగా కమెడియన్, విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులయ్యారు. ఆయన తెలంగాణ యాస ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఫిష్ వెంకట్ తెలుగులో ఖుషీ, యోగి, గుడుంబా సత్తి పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత 'ఆది', 'బన్నీ', 'డీ', 'రెడీ', 'కింగ్', 'గబ్బర్ సింగ్', 'నాయక్', 'డీజే టిల్లు' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించారు. చివరిగా ఆయన 'కాఫీ విత్ కిల్లర్' అనే వెబ్ సీరీస్ లో కనిపించారు. కొంతకాలంగా ఆరోగ్యం పాడవడంతో సినిమాలకు దూరమయ్యారు.
ఫిష్ వెంకట్ ఎలా అయ్యారు
ఫిష్ వెంకట్ అసలు పేరు వెంకట్. అయితే ఆయన సినిమాల్లోకి రాకముందు ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవారట. అందుకే అందరూ ఆయన్ని "ఫిష్ వెంకట్" అని పిలవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు ఆయన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది.