/rtv/media/media_files/2025/07/02/flipkart-sale-announced-big-bachat-days-sale-2025-07-02-16-47-09.jpg)
Flipkart Sale announced BIG BACHAT DAYS SALE
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్ బచాత్ డేస్’ పేరుతో కొత్త సేల్‌ను ప్రకటించింది. ఇది జూలై 1 నుంచి 5వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
Flipkart BIG BACHAT DAYS SALE
స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్
OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.18,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.14,999లకే లభిస్తుంది.
Motorola G85 5G మొబైల్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,999 ఉండగా.. ఇప్పుడు కేవలం 16,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
POCO C75 5G స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.11,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.8,499లకే కొనుక్కోవచ్చు. వీటన్నింటిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
ల్యాప్‌టాప్ ఆఫర్స్
ఈ సేల్‌లో Samsung Galaxy Book4 ల్యాప్‌టాప్‌పై అదిరిపోయే ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.57,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.40,990లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇది 8జీబీ/512జీబీ SSD/విండోస్ 11 హోమ్‌తో వస్తుంది. ఏడాది వారంటీ కూడా లభిస్తుంది.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
అలాగే ASUS Vivobook 15 ల్యాప్ టాప్ కూడా తక్కువకే దొరుకుతుంది. దీని అసలు ధర రూ.54,990 కాగా ఇప్పుడు రూ.30,990లకే సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా 8జీబీ/512జీబీ SSD/విండోస్ 11 హోమ్‌తో వస్తుంది. దీనికి కూడా ఏడాది వారంటీ కూడా లభిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా మరెన్నో ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అందువల్ల ఎప్పటి నుంచో మంచి సేల్ కోసం ఎదురుచూస్తుంటే.. ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.