/rtv/media/media_files/2025/07/02/england-have-won-the-toss-and-elected-to-bowl-1-2025-07-02-15-56-59.jpg)
England have won the toss and elected to bowl
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. మిస్ ఫీల్డ్, నిరాశ పరిచే బౌలింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ సిద్ధమైంది. ఇవాళ ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు జట్లు తలపడబోతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలో టీమిండియా సెకండ్ టెస్ట్ కోసం ఫైనల్ జట్టును ప్రకటించింది.
దీని ప్రకారం.. ఈ సెకండ్ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. ఫస్ట్ టెస్ట్ అనంతరం అతడు సెకండ్ టెస్ట్ ఆడటంలేదంటూ వార్తలు వినిపించాయి. పని భారం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో అతడు ఆడటం లేదని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్‌కు బుమ్రా దూరం అయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం టీమిండియా మూడు మార్పులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా.. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, ఆకాశ్‌దీప్‌లకు అవకాశం కల్పించారు.
తొలి టెస్ట్‌లో బుమ్రా దూకుడు
ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు.
టీం ఇండియా జట్టు
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.