🔴Live News Updates: మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ .. బిల్డర్లకు కోర్టు నోటీసులు!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Vijay Thalapathy TVK: విజయ్ దళపతి పార్టీకి బిగ్ షాక్
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచార వ్యూహకర్త జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత ఆయన టీవీకే కోసం పని చేయనున్నారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీ టీవీకే పెట్టిన విజయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీఎం అభ్యర్థిని కూడా తానే అని ఆయన ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కి తాత్కాలిక ఎడబాటు కలిగింది. ఫిబ్రవరిలో జరిగిన టీవీకే 2వ వార్షికోత్సవంలో ప్రశాంత్ కిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పును కలిగించే టీవీకే లక్ష్యానికి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు ప్రచారం కిషోర్ వ్యూహకర్తగా పని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
With the crucial assembly elections close at hand in Bihar, Jan Suraaj Party (JSP) president and acclaimed poll strategist #PrashantKishor has called it quits as the political consultant preparing the electoral roadmap for the #TamilagaVettriKazhagam (TVK) of actor-turned neta… pic.twitter.com/yZNDPqq53I
అలాగే బిహార్ శాసనసభ ఎన్నికల్లో తన జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ ఎన్నికల పనుల్లో ప్రశాంత్ కిశోర్ నిమగ్నమయ్యారు. ఇందుకోసం టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈక్రమంలో 30మంది పీకే టీం తమిళనాడు నుంచి వెళ్లిపోయారు. బిహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబరులోపు ఆయన మళ్లీ టీవీకేకు సలహాలు ఇస్తారని సమాచారం.
Prashant Kishor pauses as advisor to actor Vijay & Tamilaga Vettri Kazhagam (TVK), citing election work in Bihar. Over 30 staff left TVK’s team; party eyes 2026 TN polls solo. Meanwhile, DMK & AIADMK gear up with big teams for Tamil Nadu assembly elections. #TamilNaduPolls#vijaypic.twitter.com/u91Vv1VpZZ
— Mohd Saif Ansari🇮🇳 (@Imsaifansari2) July 5, 2025
మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ .. బిల్డర్లకు కోర్టు నోటీసులు!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ హైటెక్‌సిటీకి దగ్గరలో ఉన్న ఖాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Jul 07, 2025 19:42 IST
మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు.. హరీశ్ రావుకు ఉత్తమ్ కుమార్ కౌంటర్
కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్నారు. ప్రతియేటా జులై చివరన లేదా ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు.
Uttam kumar Reddy
Jul 07, 2025 18:32 IST
దంచికొడుతున్న వర్షం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Jul 07, 2025 16:59 IST
ఒక్కో అబార్షన్ కు రూ.50 వేలు.. భువనగిరిలో దారుణ దందా.. అడ్డంగా దొరికిన డాక్టర్!
Jul 07, 2025 16:33 IST
తెలంగాణ ICET ఫలితాలు విడుదల..
తెలంగాణ ICET ఫలితాలు విడుదలయ్యాయి. 2025-26 MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థులు https://icet.tgche.ac.in/లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కులు, ర్యాంక్‌లను తెలుసుకోవచ్చు.
TG ICET Results 2025
Jul 07, 2025 16:01 IST
అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో విషాదం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి సహస్ర ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్ చుట్టి ఆడుకుంది. కరెంట్ రావడంతో ఆ టవల్ మెడకు చుట్టుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Sangareddy 9 year old girl died
Jul 07, 2025 16:00 IST
భర్త టార్చర్ .. గొడ్డు మాంసం తిను, ఖురాన్ చదువు.. హిందూ దేవుళ్ల ఫోటోలను
తన భర్త బలవంతంగా గొడ్డు మాంసం తినమని, మతమార్పిడి చేయించుకోవాలని, ఖురాన్ చదవమని బలవంతం చేస్తున్నట్లుగా ఓ వివాహిత ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జిహాద్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం సీఎం మార్పు అంశం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ స్పందించారు. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందని అన్నారు.
DK Shiva Kumar Responds on CM Change Allegations in Karnataka
Jul 07, 2025 15:41 IST
కేవలం రూ.100కే భూముల రిజిస్ట్రేషన్.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం!
ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట కేవలం రూ.100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌లు చేయనున్నట్లు ప్రకటించింది.అయితే అది వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్) రిజిస్ట్రేషన్ కు మాత్రమే వర్తిస్తుంది.
Jul 07, 2025 15:40 IST
మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
Jul 07, 2025 15:04 IST
హ్యాట్సాఫ్ ఆకాష్: తండ్రి, సోదరుడు మృతి.. క్యాన్సర్తో సోదరి పోరాటం.. భాదలోనూ హీరోనే!
ఆకాష్ దీప్ తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడు. అతని తండ్రి మరణం తర్వాత సోదరుడు కూడా మరణించాడు. దీంతో క్రికెట్ కు మూడు సంవత్సరాల విరామం తీసుకున్న ఆకాష్.. మళ్లీ ఫోకస్ పెట్టి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అతని సోదరి ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడింది.
Jul 07, 2025 15:03 IST
జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్‌రావు చెప్పిన లాజిక్ ఇదే!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.
BJP Ram Chander Rao
Jul 07, 2025 13:54 IST
Bus Overturns: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Punjab Hoshiarpur bus overturning
Jul 07, 2025 12:12 IST
BREAKING: భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. యుగాంతం ఎఫెక్ట్?
ఇండియా, మయన్మార్ సరిహద్దులో 4.6 తీవ్రతతో భూప్రకంపం సంభవించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని అంటున్నారు.
India
Jul 07, 2025 12:12 IST
IND VS ENG 2ND TEST: 58 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత్.. గిల్ మామూలోడు కాదు
ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్ చారిత్రక విజయం సాధించింది. నిన్న టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్‌లో భారత్‌కు ఇది మొదటి టెస్ట్ గెలుపు.
IND VS ENG 2ND TEST
Jul 07, 2025 12:11 IST
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా! కాళ్ళలో ఈ 5 లక్షణాలు ఉంటే నివారణ ఉపాయాలు తెలుసుకోండి
చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పాదాల చర్మం పాలిపోయినట్లు, నీలం రంగులో లేదా మెరుస్తూ కనిపించవచ్చు. చర్మం పలుచబడటం, జుట్టు రాలడం చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు సంకేతం. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటూ ఆహారంలో ఆరోగ్యకరమైవి తినాలి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెరికాలోని మిషగన్‌లో తీసుకున్న స్టన్నింగ్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్‌లోని వీధుల్లో సామ్ డిఫరెంట్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Jul 07, 2025 12:11 IST
Elon Musk Political Party: ముందన్న సవాళ్లు ఇవే.. అసలు అమెరికాలో రాజకీయ పార్టీలు ఎన్నంటే..?
అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలోన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించడంతో మూడవ పార్టీల పాత్రపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఎలన్ మస్క్ పార్టీ ముందున్న సవాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Jul 07, 2025 12:10 IST
Chiranjeevi - Venkatesh: చిరంజీవి సినిమాలో నా పాత్ర హైలైట్.. మొత్తం చెప్పేసిన వెంకటేష్
NATS 2025లో విక్టరీ వెంకటేష్ మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నట్లు ధృవీకరించారు. "అది చాలా సరదాగా ఉండబోతోంది!" అని ఆయన అన్నారు. ఇది మెగా, దగ్గుబాటి అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది.
NATS 2025లో విక్టరీ వెంకటేష్ మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నట్లు ధృవీకరించారు.
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1' మూవీ విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. నేడు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అక్టోబర్ 2వ తేదీన మూవీ విడుదల ఉంటుందని తెలిపారు.
Jul 07, 2025 11:11 IST
Mahendra Singh Dhoni Birthday Special: ఒకటి కాదు.. రెండు కాదు.. కెప్టెన్ కూల్ ధోని అరుదైన రికార్డులు!
నేడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు. ధోని తన 44 పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులు సాధించారు. అవేంటో ఏంటో చూద్దాం.
Mahendra Singh Dhoni Birthday Special
Jul 07, 2025 11:10 IST
Dry Fruits: వర్షాకాలం డ్రై ఫ్రూట్స్ పాడవుతున్నాయా..? అయితే ఈ టిప్స్ పాటించండి
వర్షాకాలంలో తేమ కారణంగా డ్రై ఫ్రూట్స్‌లో ఫంగస్, కీటకాల ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా డ్రై ఫ్రూట్స్ త్వరగా చెడిపోతాయి. వర్షాకాలంలో వాటిని సరిగ్గా నిల్వ చేయాలటే డ్రై ఫ్రూట్స్ నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించాలి.
Jul 07, 2025 11:09 IST
Van Mahotsav: రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మనవహోత్సవంలో రుద్రాక్ష మొక్కను నాటారు. వనమహోత్సవం 2025ను తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఉన్నామని ఆయన స్ఫష్టం చేశారు.
Jul 07, 2025 09:56 IST
BRICS Countries: బ్రిక్స్ సభ్యదేశాలకు ట్రంప్ బిగ్ షాక్.. అమెరికా సంచలన ప్రకటన
బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10% టారిఫ్‌లు విధిస్తామని సోమవారం ట్రంప్ స్పష్టం చేశారు.
Trump
Jul 07, 2025 09:19 IST
Road Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భార్యాభర్తలను బలి తీసుకున్న లారీ!
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర భార్యాభర్తలు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. స్పాట్‌లోనే భార్యాభర్తలు మృతి చెందారు. అయితే తూప్రాన్‌పేట్‌కు చెందిన వెంకటేష్, లక్షీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Accident
Jul 07, 2025 09:18 IST
Trump Tariffs: ఆగస్టు ఒకటి నుంచి కొత్త టారీఫ్ లు ..వైట్ హౌస్
అత్యంత వివాదం సృష్టించి, వాణిజ్య యుద్ధానికి దారి తీశాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లు. దాంతో వాటికి తాత్కాలిక బ్రేక్ వేశారు. జూలై 9 వరకు ఉన్న ఈ డెడ్ లైన్ ను ఇప్పుడు మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది.
trump tariffs
Jul 07, 2025 09:18 IST
BIG BREAKING: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. రంగంలోకి 18 ఫైర్‌ఇంజన్లు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్ పేపర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పోగలు, పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Jul 07, 2025 09:18 IST
Donald Trump: మస్క్ కొత్త పార్టీ ప్రకటన పెద్ద జోక్: డొనాల్డ్ ట్రంప్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెద్ద జోక్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ చాలా విజవంతమైనది, మస్క్ గాడి తప్పి మూడో పార్టీ పెట్టారని ట్రంప్ అన్నారు.
donald trump
Jul 07, 2025 09:17 IST
Rock Salt: చిటికెడు రాక్ సాల్ట్ నీటిలో కలిపి 5 రకాల ప్రయోజనాలు పొందండి
రోజు రాతి నీరు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రాతి ఉప్పులో సహజ ఎలక్ట్రోలైట్లు శరీరంలోని ప్రతి కణానికి నీటిని సరఫరా చేయడానికి పనిచేస్తాయి. సెల్యులార్ స్థాయిలో హైడ్రేషన్ జరిగినప్పుడు.. శక్తి స్థాయి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Rock Salt
Jul 07, 2025 09:17 IST
Ind-Eng: ఇంగ్లాండ్-ఇండియా రెండో టెస్ట్ లో నమోదైన రికార్డ్ లు..
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
India-England Second Test
Jul 07, 2025 09:15 IST
TG Crime: పూరీ ముక్కనే ప్రాణం తీసింది.. గొంతులో ఇరుక్కొని యువకుడు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూరీ తింటుండగా యువకుడి గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Mahabubnagar crime news
Jul 07, 2025 09:15 IST
TG Crime: వీడు భర్త కాదు రాక్షసుడు.. భార్యను అడవిలోకి తీసుకెళ్లి..!
ఆదిలాబాద్ జిల్లాలో ఓ భర్త తన భార్య మీద అనుమానంతో పూజలు పేరుతో అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. పూజ చేస్తున్నట్లు నటించి భార్య తలపై బండ రాళ్లతో కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
ADILABAD
Jul 07, 2025 08:02 IST
BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు.
Jul 07, 2025 08:02 IST
Texas Heavy Floods: టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 70కి చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలకు ఇప్పటి దాకా 70 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు అన్ని వరదలకు మునిగిపోయాయి. శిబిరాల్లో ఉంటున్న 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Texas
Jul 07, 2025 08:01 IST
Golden Visa: అమెరికాకు పోటీగా గోల్డెన్ వీసా..కేవలం రూ.23 లక్షలకే
అమెరికా గోల్డెన్ వీసాకు పోటీగా ఇప్పుడు మరో వీసా వచ్చేస్తోంది. కేవలం రూ.23 లక్షలు ఇస్తే చాలు ఈ జీవిత కాలపై వీసాను పొందవచ్చును. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి అయిన యూఏఈ దీనిని అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..
UAE Golden Visa
Jul 07, 2025 07:25 IST
Amaltas leaves వర్షం వల్ల వచ్చే తేమతో దురద, చెమట సమస్య! అయితే ఈ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయండి
వర్షాకాలంలో తేమ వల్ల చర్మం దురద, మంటగా ఉంటే ఉపశమనం కోసం ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. వాటిల్లో కాసియా ఫిస్టులా చెట్టు ఆకులతో స్నానం చేస్తే ఉపశమనం సులభంగా పొందవచ్చు. ఈ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
amaltas leaves
Jul 07, 2025 07:25 IST
BIG BREAKING: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు
రియల్ ఎస్టేట్ సంస్థ క్యాంపెనర్‌గా ఉన్న మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను ప్రమోట్ చేస్తున్నందుకు ఆయన్ని మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
Jul 07, 2025 06:58 IST
China: చైనాకు కొత్త అధ్యక్షుడు? జెన్ పింగ్ అధికారాల బదిలీ అందుకేనా?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవీ విరమణ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. కొన్ని బాధ్యతలను తదుపరి నాయకులకు అప్పగించడం దీనికి నిదర్శనమని అంటున్నారు. 12 ఏళ్ళ సుదీర్ఘ పాలనకు జిన్ పింగ్ ముగింపు పలకనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Jul 07, 2025 06:57 IST
గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు.. 100పైగా టార్గెట్లు
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి షాఫా హాస్పిటల్ అధికారులు ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో యుద్ధ ప్రాంతంలో వందకు పైగా టార్గెట్లపై అటాక్‌లు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.
Jul 07, 2025 06:50 IST
Weather Update: తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Rains
Jul 07, 2025 06:50 IST
Raisins: ఐదు రకాల ఎండు ద్రాక్షలు.. ఏ రకం తింటే ఎలాంటి ప్రయోజనం తెలుసుకోండి
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. నల్ల ద్రాక్ష, పసుపు ఎండుద్రాక్ష, ఆకుపచ్చ ఎండుద్రాక్ష, ఎర్ర ఎండుద్రాక్ష, ఎండుద్రాక్ష ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి
Raisins
Jul 07, 2025 06:49 IST
Jammu Kashmir: విషాదం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే జవాన్ మృతి
జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న బాపట్లకి చెందిన జవాన్ రవి తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతి చెందాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రవి, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.