Heavy Rain: దంచికొడుతున్న వర్షం..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

New Update
heavy rains

Heavy Rain in telangana

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో ఆయా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆయా జిల్లాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మిగిలిని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో చిదురు ముదురుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.    

Also Read: వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్

Telangana Rain Alert

మరో వైపు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఆరెంజ్ అలర్ట్  జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని...బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉషోగ్రతలు తగ్గ్గుముఖం పడతాయని తెలిపింది.  చింది వాతావరణ శాఖ.

Also read:  ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!

రానున్న రెండు రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిమాజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పది జిల్లాలకు  వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలకూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌ను జారీ చేసింది. హైదరాబాద్‌‌‌‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడే చాన్స్‌‌‌‌ ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది.  

Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

Also Read : అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి

heavy-rain-alert | telangana rain alert | rain alert for hyderabad | Rain Alert To Hyderabad | Rain Alert To Telangana | rains

Advertisment
Advertisment
తాజా కథనాలు