Vijay Thalapathy TVK: విజయ్ దళపతి పార్టీకి బిగ్ షాక్

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచార వ్యూహకర్త జన్‌ స్వరాజ్‌ పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. బిహార్‌ ఎన్నికల తర్వాత ఆయన టీవీకే కోసం పని చేయనున్నారు.

New Update
TVK anniversary celebrations

TVK anniversary celebrations Photograph: (TVK anniversary celebrations)

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీ టీవీకే పెట్టిన విజయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీఎం అభ్యర్థిని కూడా తానే అని ఆయన ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కి తాత్కాలిక ఎడబాటు కలిగింది. ఫిబ్రవరిలో జరిగిన టీవీకే 2వ వార్షికోత్సవంలో ప్రశాంత్‌ కిశోర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పును కలిగించే టీవీకే లక్ష్యానికి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు ప్రచారం కిషోర్ వ్యూహకర్తగా పని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

అలాగే బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో తన జన్‌ స్వరాజ్‌ పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ ఎన్నికల పనుల్లో ప్రశాంత్‌ కిశోర్‌ నిమగ్నమయ్యారు. ఇందుకోసం టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈక్రమంలో 30మంది పీకే టీం తమిళనాడు నుంచి వెళ్లిపోయారు. బిహార్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబరులోపు ఆయన మళ్లీ టీవీకేకు సలహాలు ఇస్తారని సమాచారం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు