/rtv/media/media_files/2025/07/07/dk-shiva-kumar-responds-on-cm-change-allegations-in-karnataka-2025-07-07-15-43-32.jpg)
DK Shiva Kumar Responds on CM Change Allegations in Karnataka
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం వివాదంగా మారింది. రాబోయే రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు తానే ఈ పదవిలో ఉంటానని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం మార్పు అంశం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ స్పందించారు. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందని అన్నారు.
Also Read: 18 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్న లేడీ ఆఫీసర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే
Also Read : పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
DK Shiva Kumar Responds On CM Change In Karnataka
ఇక వివరాల్లోకి వెళ్తే.. రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివచార్య స్వామితో కలిసి ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పీఠాధిపతి మాట్లాడారు. 2023 ఎన్నికల తర్వాత శివకుమార్‌కు ఉన్నత పదవి దక్కాల్సి ఉందని.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఆయన చేసిన కృషి గురించి ప్రజలకు తెలుసని అన్నారు. దీనిపై స్పందించిన డీకే శివకుమార్.. '' పార్టీ కార్యకర్తలు, ప్రజలకు తమక సొంత అభిరుచులు ఉంటాయి. వాళ్ల ఆకాంక్షలు నేను తప్పుబట్టటం లేదు. మేమందరం కలిసి పార్టీని నిర్మించాం. మేము క్రమశిక్షణ కలిగిన సైనికలం. కలిసి చర్చిస్తాం. పార్టీ నిర్ణయాలను అనుసరిస్తాం. సిద్ధరామయ్య కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారని'' డీకే శివకుమార్ అన్నారు.
Also read: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది
ఇటీవల సీఎం సిద్ధరామయ్య కూడా సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. అందులో సందేహం ఎందుకని తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీనియర్ నేత అయిన సిద్ధరామయ్యకే హైకమాండ్ సీఎం బాధ్యతలు అప్పిగించింది. అలాగే రెండేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం మార్పు అంశం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ కాంగ్రెస్ ఎమ్మె్ల్యే కూడా మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని చెప్పడంతో ఈ అంశం సంచలనం రేపింది.
Also Read : క్యాన్సర్ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్
dk-shiva-kumar | rtv-news | telugu-news