/rtv/media/media_files/2025/07/06/director-sandeep-raj-air-web-series-controversy-2025-07-06-20-04-47.jpg)
Director Sandeep Raj air web series controversy
‘కలర్ ఫోటో’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుని, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో వివాదాల్లో చిక్కుకున్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ (AIR) వెబ్ సిరీస్‌కు సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లు ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే విమర్శలు రావడంతో ఈ వివాదం రాజుకుంది.
వివాదం ఏంటి?
జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ‘ఏఐఆర్’ వెబ్ సిరీస్ పదో తరగతి పూర్తయిన ముగ్గురు విద్యార్థులు విజయవాడకు వచ్చి ఇంటర్మీడియట్‌లో చేరిన తర్వాత ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్‌లో విద్యార్థుల ఒత్తిడి, హాస్టల్ జీవితాలు వంటి అంశాలను చూపించారు. అయితే ఇందులో ఒక హాస్టల్ సన్నివేశంలో.. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సీన్లు ఉన్నాయని అవి ఆ వర్గం మనోభావాలను దెబ్బతీశాయని నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా టీడీపీ, కమ్మ హీరో- హీరోయిన్లపై పంచులు, వారి రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్‌లు ఉన్నాయని టీడీపీ కార్యకర్తలు, కమ్మ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇది కుల విద్వేషాలను ప్రేరేపించేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నందమూరి అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని సెటైరికల్ డైలాగ్‌లు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై సందీప్ రాజ్ స్పందించి క్షమాపణలు చెప్పాడు.
Dear brothers,
— Sandeep Raj (@SandeepRaaaj) July 5, 2025
2025 started on a greatest note for me by being part of such massive blockbuster film like Daaku Maharaj.
The love i got in the name of tweets, gave me immense confidence to do more and more beautiful work.
But now seeing the hatred from same accounts and same…
సందీప్ రాజ్ క్షమాపణ
వివాదం ముదరడంతో దర్శకుడు సందీప్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని, ఉద్దేశపూర్వకంగా ఏ సామాజిక వర్గాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. ‘‘ప్రియమైన సోదరులారా ఈసారికి వదిలేయండి. మళ్ళీ ఆ తప్పు చేయను. నేను దీనిపై క్షమాపణలు చెబుతున్నాను. మేము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. ప్రేక్షకులు ఎప్పుడూ సరైనవారే అని ఒక చిత్రనిర్మాతగా నేను నమ్ముతాను. నేను చాలా చింతిస్తున్నాను’’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా వివాదాస్పద సన్నివేశాన్ని వెబ్ సిరీస్ నుండి తొలగించినట్లు కూడా ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా మరింత బాధ్యతగా ఉంటామని హామీ ఇచ్చారు.