Donald Trump: మస్క్ కొత్త పార్టీ ప్రకటన పెద్ద జోక్: డొనాల్డ్ ట్రంప్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెద్ద జోక్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ చాలా విజవంతమైనది, మస్క్ గాడి తప్పి మూడో పార్టీ పెట్టారని ట్రంప్ అన్నారు.

New Update
donald trump

donald trump

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ది అమెరికన్ అనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీ ప్రకటన పెద్ద జోక్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఈ కొత్త పార్టీపై మాట్లాడుతూ.. మూడవ పార్టీని ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని నేను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. 

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

మస్క్ దారి తప్పారని..

మన రిపబ్లికన్ పార్టీ చాలా విజయవంతమైంది. డెమొక్రాట్లు తమ మార్గాన్ని కోల్పోయారు.. కానీ అది ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ. మూడవ పార్టీని ప్రారంభించడం గందరగోళాన్ని పెంచుతుందన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు. గత ఐదు వారాల్లో ఎలోన్ మస్క్ పూర్తిగా దారి తప్పారని, అతని పరిస్థితి చాలా దారుణంగా మారడని పోస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ కారు కొనాలనే అవసరాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించాను. గ్యాసోలిన్‌తో నడిచే, హైబ్రిడ్, కొత్త సాంకేతికతలతో కూడిన వాహనాలను కొనుగోలు చేసే స్వేచ్ఛ కోసం నేను వాదించాను. 

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

నేను రెండు సంవత్సరాలుగా దీనిపై ప్రచారం చేస్తున్నాను అని అన్నారు. దీని వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్నికలకు ముందు క్లోజ్‌గా ఉన్న వీరిద్దరి మధ్య ఎలక్ట్రిక్ వాహనం వల్ల దూరం పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మాటల వార్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసుకున్నారు. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత రోజే ఎలాన్ మస్క్ కొత్త పార్టీను ప్రకటించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు