/rtv/media/media_files/2025/07/07/chiranjeevi-venkatesh-2025-07-07-11-17-55.jpg)
Venkatesh says he is playing a guest role in Chiranjeevi 157 film at nats 2025 event
Chiranjeevi - Venkatesh: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS 2025) 8వ కన్వెన్షన్ (NATS Sambaralu 2025) వేదికపై విక్టరీ వెంకటేష్ తన రాబోయే చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి(Anil Raavipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 157’(MEGA 157) చిత్రంలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నానని వెంకటేష్ వెల్లడించారు.
Also Read:APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
చిరు మూవీలో నా పాత్ర సూపర్
‘‘అది చాలా సరదాగా ఉండబోతోంది!’’ అంటూ చిరంజీవి సినిమాలో తన అతిథి పాత్ర గురించి వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అభిమానుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపింది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే అని చెప్పాలి.
#Venkatesh about his upcoming films at #NATS2025
— Gulte (@GulteOfficial) July 7, 2025
- A Film with #Trivikram
- A Cameo with #Chiranjeevi (that's gonna be a fun one!)
- #Drishyam again with Meena
- Again #SankranthikiVasthunnam with #AnilRavipudi
- Biggest one will be with my friend Balayya! (?) pic.twitter.com/QeabYGMX1m
Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
గతంలో అనిల్ రావిపూడి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కేవలం అతిథి పాత్ర కాదని, కథలో కీలకమైన పాత్ర అని చెప్పినప్పటికీ, వెంకటేష్ మాత్రం దీనిని ‘అతిథి పాత్ర’గానే అభివర్ణించడం గమనార్హం. ఏదేమైనా ఈ సినిమాలో వెంకటేష్ ఎంట్రీ ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అవుతుందని అనిల్ రావిపూడి ఇప్పటికే వెల్లడించారు.
ఇకపోతే చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించడం ఇది మొదటిసారి కాదు. 1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ సినిమాలో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించగా.. అందులోని ఒక పాటలో చిరంజీవి అతిథిగా మెరిశారు.
Also Read:గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
ఈ NATS వేదికపై వెంకటేష్ తన ఇతర ప్రాజెక్టుల గురించి కూడా వెల్లడించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మొదటిసారి సినిమా చేస్తున్నానని, అది చాలా వినోదాత్మకంగా ఉంటుందని చెప్పారు. అలాగే ‘దృశ్యం 3’ లో మీనాతో కలిసి నటించనున్నట్లు తెలిపారు. ఇంకా అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలిపారు. అందరికంటే పెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే, తన స్నేహితుడు నందమూరి బాలకృష్ణతో ఒక భారీ ప్రాజెక్ట్ ఉందని కూడా వెంకటేష్ హింట్ ఇచ్చారు. మొత్తం మీద వెంకటేష్ రాబోయే రోజుల్లో ప్యాక్డ్ షెడ్యూల్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ NATS 2025 ఈవెంట్ ద్వారా స్పష్టమైంది.