/rtv/media/media_files/2025/07/07/second-test-2025-07-07-08-25-41.jpg)
India-England Second Test
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా బౌలర్ ఆకాశ్ దీప్ 99 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఈ మొత్తం మ్యాచ్ ఒక అద్భుతమనే చెప్పాలి. అంతకుముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు వచ్చేలా చేశాడు. దీంతో మొత్తం మ్యాచ్లో పలు రికార్డ్ లు నమోదయ్యాయి.
రెండో టెస్ట్ లో నమోదయిన రికార్డులివే..
విదేశీ పిచ్ ల మీద టెస్ట్ లలో భారత్ కు అత్యంత పెద్ద విజయం ఇదే. 336 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. దాంతో పాటుగా ఎడ్జ్ బాస్టన్ లో విజయం సాధించిన మొదటి ఆసియా జట్టు కూడా ఇండియా రికార్డ్ కొట్టింది. 1967లో ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. 58 ఏళ్ల తర్వాత మొదటిసారి మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది. అలాగే SENA దేశాల్లో 30 టెస్ట్ మ్యాచ్ లు గెలిచినది కూడా భారత్.
ఇక అత్యంత చిన్న వయసులో విదేశీ గడ్డ మీద గెలిచిన భారత కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ రికార్డ్ సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, 150కిపైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా కూడా గిల్ అరుదైన రికార్డ్ ను అందుకున్నాడు. బౌలర్లలో ఇంగ్లాండ్ లో ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా ఆకాశ్ దీప్ చరిత్ర సృష్టించాడు. ఇతను 187 పరుగులకు 10 వికెట్లు తీశాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్‌లోనే చేతన్ శర్మ (10/188) పది వికెట్లు తీశాడు
ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు 1692.. ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టుల్లో ఇవే అత్యధిక పరుగులు కావడం గమనార్హం.
Also Read: Golden Visa: అమెరికాకు పోటీగా గోల్డెన్ వీసా..కేవలం రూ.23 లక్షలకే