IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.  72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్  271  పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో  భారత్ 336 పరుగుల తేడాతో గెలిచి 5మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది

New Update
india won

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్  భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.  72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్  271  పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో  భారత్ ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.  రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని ఆకాష్ సింగ్ శాసించాడు. 

జేమీ స్మిత్ (88) పరుగులతో

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో  జేమీ స్మిత్ (88) పరుగులతో ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ఈ వేదికపై భారత్ తొలిసారిగా టెస్ట్ విజయం సాధించింది. గతంలో బర్మింగ్‌హామ్‌లో భారత్ 8 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లు ఓడిపోయింది, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.  ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో 58 సంవత్సరాల తర్వాత భారత్ టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. 25 ఏళ్ల శుభ్‌మాన్ గిల్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, కపిల్ దేవ్, వెంకటరాఘవన్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, కోహ్లీ నాయకత్వంలో సాధ్యం కాని రికార్డును సాధించాడు.  

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, గిల్ అద్భుతమైన బ్యాటింగ్ తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం అని తెలిపాడు. అతను తమ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదని  అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు.  కాగా  ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జులై 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు