/rtv/media/media_files/kmNyVsgDe1t4H9zVFXKk.jpg)
Mahesh Babu Legal Notice
Mahesh Babu Legal Notice:
సినీనటుడు మహేశ్ బాబుకు షాక్ ఎదురైంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ క్యాంపెనర్‌గా ఉన్న మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా(Rangareddy District) వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త హీరో మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
Also Read: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ప్లాన్ కనుగోలు చేసిన ఇద్దరు వినియోగదారుల ఫొరంని ఆశ్రయించారు. యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తా మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో వారు రెండు ప్లాట్లు కొనడానికి రూ.34,80,000 చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేశ్‌బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్‌లో వెంచర్ చూసి వారు డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ పర్మిషన్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగి ఇవ్వమంటే యజమాని అతికష్టం మీద కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కన్యూమర్ కోర్టు పేర్కొంది.
Also Read: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
ఏప్రిల్‌లో మహేశ్ బాబుకు ఈడీ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది. యాడ్స్‌కు కోసం రూ.3.4 కోట్లు తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే విషయంలో మనీలాండరింగ్ విచారణ జరిపారు.
Also Read: Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
SHOCKING‼️
— G3 (@gayatri008_16) April 22, 2025
*హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు*
*సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు*
*యాడ్స్‌కు రూ.3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ* pic.twitter.com/duBAjMbmaI
Also Read: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో