మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు-VIDEO

నెల్లూరు VR  స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.

New Update
Narayana Vs Anam

నెల్లూరులో మంత్రి నారాయణపై జిల్లాకు చెందిన మరో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. స్థానిక VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వేదిక మీదే అభ్యంతరం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. నేడు స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. VR హైస్కూల్ పేరులో మునిసిపల్ కార్పొరేషన్ పదాన్ని తొలగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు లేనప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

Also Read :  క్యాన్సర్‌ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్

Also Read :  నా వద్ద అవి లేవని చెప్పా.. తప్పేముంది: కంగనా రనౌత్

Also Read :  ఫోటోలకు పోజులిస్తూ .. చూస్తుండగానే కావేరి నదిలో కొట్టుకుపోయాడు!

కార్పొరేట్ స్కూల్ గా మార్చొద్దు..

నాడు వేంకటగిరి రాజాలు నిధులు ఇవ్వకపోయినా.. వారి పేరు మీదే కాలేజీ ని స్థాపించారన్నారు. 50 ఏళ్లుగా ఆనం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో VR విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం కక్ష కట్టి మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తనను తొలగించిందని ఆరోపించారు. వీఆర్ హైస్కూల్ ను కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే భావితరాలకి ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్స్ ను మంత్రి పొంగూరు నారాయణ దత్తత తీసుకోవాలని సూచించారు. మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల ద్వారా ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారని.. తమది మొదటి నుంచి రాజకీయ కుటుంబం అని సెటైర్లు వేశారు. 

Also Read :  అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు!

anam-ramanarayana-reddy | telugu breaking news | telugu-news | minister-narayana

Advertisment
Advertisment
తాజా కథనాలు