/rtv/media/media_files/2025/07/07/uae-2025-07-07-07-34-44.jpg)
UAE Golden Visa
Golden Visa: ధనవంతుల కోసం ట్రంప్(Trump) గోల్డెన్ వీసా తీసుకువచ్చారు. 5 మిలియన్స్ పెట్టి దీన్ని ఎవరనా కొనుక్కోవచ్చని చెప్పారు. అయితే ఇది అత్యంత కాస్ట్లీ వీసా(Most Costly Visa). సామాన్యులకు అందుబాటులో లేనిది. అయితే అత్యంత చీప్ గోల్డెన్ వీసా కూడా ఉందని మీకు తెలుసా. కేవలం రూ.23 లక్షల కే దాన్ని సొంతం కూడా చేసుకోవచ్చును. ఈ వీసాను అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన యూఏఈ అందిస్తోంది.
Also Read: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
23 లక్షలు ఉంటే చాలు యూఈఏ వీసా(UAE Golden Visa)..
యూఏఈ గోల్డెన్ వీసాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన దేశం(India)లో చాలా మందికి ఈ వీసా కూడా ఉంది. సినిమా యాక్టర్లు రాజకీయ నేతలు దాదాపు అందరికీ ఈ వీసా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో మరో కొత్త వీసాను ప్రవేశపెడుతోంది యూఏఈ. స్థిరాస్థి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా.. నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను ఇవ్వనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా మొదట ఇండియా, బంగ్లాదేశ్ వాసులకు ఇవ్వనుంది. దీని కోసం భారత్ లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.
Also Read: Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
ఇప్పటి వరకు దుబాయ్ గోల్డెన్ వీసా పొందాలంటే కనీసం 20 లక్షల ఏఈడీ అంటే దాదాపు 4.66 కోట్లు లేదా పెద్ద మొత్తంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి. కానీ ఇప్పుడు కొత్త ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసాలో మాత్రం కేవలం లక్ష ఈఏడీ అంటే రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవిత కాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాలు పొందవచ్చను. ఈ గోల్డెన్ వీసా కోసం తమ దేశం నుంచే అప్లై చేసుకోవచ్చును. రియాద్ రిజిస్టర్డ్ కార్యాలయాలు, ఆన్‌లైన్ పోర్టల్, వన్‌వాస్కో కేంద్రాలు, ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈ వీసా వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులనూ దుబాయ్ తీసుకురావచ్చును. సహాయకులను, డ్రైవర్లను పెట్టుకోవచ్చును. దుబాయ్ లోనే ఏదైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చును ఈ గోల్డెన వీసా జీవిత కాలం చెల్లుబాటు అవుతుంది. భారత్, బంగ్లాదేశ్ తరువాత దీనిని మిగతా దేశాలకూ విస్తరించనున్నారు.
Also Read: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
Also Read: Chinese President: చైనాకు కొత్త అధ్యక్షుడు? జెన్ పింగ్ అధికారాల బదిలీ అందుకేనా?