Jammu Kashmir: విషాదం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న బాపట్లకి చెందిన జవాన్ రవి తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతి చెందాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రవి, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

New Update
Javan

Javan

ఇటీవల నిశ్చితార్థం చేసుకుని, త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్న జవాన్ ఆకస్మికంగా మృతి చెందిన ఘటన బాపట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఇమాన్యుయేల్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు అయిన ఉప్పాల రవికుమార్‌ (24) నాలుగేళ్ల కిందట భారత ఆర్మీలో చేరారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

తుపాకీ పేలడంతో..

శనివారం రాత్రి అనుకోకుండా తుపాకీ పేలడంతో అక్కడిక్కడే రవి మృతి చెందారు. రెండు నెలల కిందట రవి సెలవులు మీద ఇంటికి వచ్చారు. బంధువుల కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకుందామని అనుకున్న సమయంలో ఆపరేషన్ సిందూర్ వల్ల సెలవులు వాయిదా వేసుకుని విధుల్లోకి వెళ్లిపోయారు. అయితే మళ్లీ సెలవుల మీద వచ్చి పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పారు. కానీ ఇంతలో ఇలా కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

మొహర్రం ఊరేగింపు వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో చోటుచేసుకుంది. రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో మొహర్రం ఊరేగింపు వేడుకలను జరుపుకోవడానికి అగ్నిగుండం సిద్ధం చేశారు.

ఇది కూడా చూడండి: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

అందులో పరిగెడుతుండగా హనుమంత్ అనే 40 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు. తీవ్రంగా కాలిపోయిన హనుమంత్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న లింగ్సుగూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి: IND vs ENG  :  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు