/rtv/media/media_files/2025/07/07/adilabad-2025-07-07-08-05-44.jpg)
ADILABAD
ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను, భర్తలు భార్యలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానం, ఇతరులతో ఉన్న రిలేషన్స్ వల్ల ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
అనారోగ్యం పేరుతో భార్యను..
సుందరయ్య నగర్ కాలనీలో ఉంటున్న ఇంగోలి వందన (40) అనే మహిళ మీద అనుమానంతో తన భర్త శంకర్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వందనకు ఆరోగ్యం బాలేదని, భర్త ఇంగోలి శంకర్ పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 2వ తేదీన లక్ష్మీ పూర్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
భార్యను నమ్మించడానికి అక్కడ కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ వంటి వాటితో పూజలు నిర్వహించారు. ఆ పై భార్యను తలపై బండ రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చేశాడు. అయితే తల్లి కనిపించకపోయే సరికి తండ్రి మీద అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తన భార్యను చింపేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో పూజలు ఉండటంతో క్షుద్ర పూజల పేరుతో హత్య చేశాడని స్థానికులు భావిస్తున్నారు. అలాగే అక్రమ సంబంధం వల్ల అనుమానంతో తన భార్యను చంపినట్లు అంటున్నారు. దీనిపై పూర్తి విచారణ ఇంకా పోలీసులు చేస్తున్నారు.