/rtv/media/media_files/2025/07/07/india-won-the-match-against-england-at-edgbaston-ground-after-58-years-2025-07-07-12-00-18.jpg)
IND VS ENG 2ND TEST
ఎట్టకేలకు టీమిండియా 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. నిన్న (ఆదివారం, జూలై 6, 2025) ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది.
Also Read:APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
IND VS ENG 2ND TEST
కాగా ఎడ్జ్‌బాస్టన్ గడ్డపై భారత్‌కు ఇది మొదటి టెస్ట్ విజయం కావడం విశేషం. నిన్నటి మ్యాచ్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో టీం ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 1967లో మన్సూర్ పటౌడి నాయకత్వంలో ఎడ్జ్‌బాస్టన్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. అందులో భారతదేశం ఓడిపోయింది.
Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
1986లో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ గ్రౌండ్‌లో భారత జట్టు ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇప్పుడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా 58 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచి చూసి చరిత్ర సృష్టించింది. దీంతో గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read:గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో (269, 161) కదం తొక్కి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో యువ పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 10 వికెట్లు (4/88, 6/99) పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ (6/70) కూడా అద్భుతంగా రాణించాడు.
608 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (88) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లాండ్ 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది.