BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే

బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్‌ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు.

New Update
modi in BRICS

బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్‌ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు. మొదటి BRIC శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగింది. 2010లో న్యూయార్క్‌లో జరిగిన BRIC విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను చేర్చడంతో BRICని BRICSలోకి విస్తరించడానికి అంగీకరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో సన్యాలో జరిగిన మూడవ BRICS శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది. ఇలా బ్రిక్స్ తనని తాను విస్తరించుకుంటూ పోతుంది. 2026లో బ్రిక్స్‌కు భారత్ నాయకత్వం వహించనుంది.

అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్ధ గోళం బాధితురాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సంస్కరించాల్సిన ఆవశ్యకతను మోదీ ఈ సమావేశంలో చెప్పారు.  బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌కు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలు.. సిమ్‌కార్డును కలిగి ఉన్నప్పటికీ నెట్‌వర్క్‌ లేని మొబైల్‌ ఫోన్‌లాంటివని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో దక్షిణార్ధ గోళ దేశాలకు కంటితుడుపు చర్యలు తప్ప ఏమీ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు