BRICS Countries: బ్రిక్స్ సభ్యదేశాలకు ట్రంప్ బిగ్ షాక్.. అమెరికా సంచలన ప్రకటన

బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10% టారిఫ్‌లు విధిస్తామని సోమవారం ట్రంప్‌ స్పష్టం చేశారు.

New Update
Trump issues warning for Israel after ceasefire violations

Trump issues warning for Israel after ceasefire violations

BRICS Countries:

అమెరికా అధ్యక్షుడు మరో కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై టారీఫ్‌ల(Tarriffs) పేరుతో పన్నులు భారం మోపుతుండగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్(Trump) హెచ్చరించారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉందని సోమవారం ట్రంప్‌ స్పష్టం చేశారు.

Also Read: Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

బ్రెజిల్‌ వేదికగా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నవేళ ట్రంప్‌ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రియో డి జనీరో నగరంలో ఈ సదస్సు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ట్రంప్‌ స్పందించినట్లు తెలుస్తోంది. అటు నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఇప్పుడు ఆ దీని వాయిదా వేశారు. అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని జూలై 7న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ ప్రకటించారు.

Also Read: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

Also Read: AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Advertisment
Advertisment
తాజా కథనాలు