Kantara Chapter 1 Release Date: కాంతార మూవీ డేట్ ఫిక్స్.. పోస్టర్ చూస్తే గూస్‌బంప్సే!

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1' మూవీ విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. నేడు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అక్టోబర్ 2వ తేదీన మూవీ విడుదల ఉంటుందని తెలిపారు.

New Update
Kantara Chapter 1 Release Date

Kantara Chapter 1 Release Date

Kantara Chapter 1 Release Date: కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి(Rishab Shetty) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1’ మూవీ విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. నేడు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే.. భారీ యాక్షన్ సీన్స్‌తో తీసినట్లు తెలుస్తోంది. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఈ పోస్టర్ ఇలా ఉంటే.. ఇంకా సినిమా గూస్ బంప్సే అని నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

మొత్తం ఏడు భాషల్లో..

కాంతార మూవీని కేవలం కన్నడలోనే మాత్రమే ముందుగా రిలీజ్ చేశారు. అక్కడ బిగ్గెస్ట్ హిట్ కావడంతో డబ్బింగ్ చేసి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం విజయం సాధించింది. దాదాపుగా రూ.300 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఏడు భాషల్లో రిలీజ్ చేస్తు్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీలో రిలీజ్ చేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Advertisment
Advertisment
తాజా కథనాలు