/rtv/media/media_files/2025/07/07/mahendra-singh-dhoni-birthday-special-2025-07-07-10-10-59.jpg)
Mahendra Singh Dhoni Birthday Special
Mahendra Singh Dhoni Birthday Special: నేడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు. ధోని తన 44 పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి భారత క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో 1981లో జులై 7వ తేదీన మహేంద్ర సింగ్ ధోని జన్మించారు. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఎన్నో అరుదైన రికార్డులు సాధించారు. పుట్టిన రోజు సందర్భంగా ఆ రికార్డులు ఏంటో చూద్దాం.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్షన్
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన ఏడుగురు క్రికెటర్లలో ఎంఎస్ ధోని కూడా ఒకరు. ఈ జాబితాలో చేరిన 11 వ భారతీయ క్రికెటర్‌గా ధోని నిలిచారు. అయితే ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐదేళ్ల తర్వాతే దీనికి అర్హత సాధిస్తారు.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
2007 లోఐసీసీ టీ 20 ప్రపంచ కప్‌ను
దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను మహేంద్ర సింగ్ ధోని 2007 లో సాధించారు. ఇతని ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించి గొప్ప విజయాన్ని ధోని నమోదు చేశారు.
2013 లో కెప్టెన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ధోని నాయకత్వంలో టీమిండియా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఫార్మాట్లలో రెండేళ్ల పేలవ ప్రదర్శనల తర్వాత ఎంఎస్ ధోనీ యువ జట్టు 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో రోహిత్ శర్మతో బ్యాటింగ్ ప్రారంభించిన వ్యూహంతో పాటు, ధోని తెలివైన బౌలింగ్‌తో భారత్ మరో ఐసీసీ టైటిల్ సాధించింది.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
2009 లో కెప్టెన్‌గా టెస్ట్ నంబర్ వన్ ర్యాంకింగ్
డిసెంబర్ 2009లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇది భారత క్రికెట్‌కు ఒక గొప్ప విజయం. ఎందుకంటే ప్రారంభమైన తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం అదే మొదటిసారి. భారతదేశం 18 నెలల పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగింది. ధోనీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గదను అందుకోవడం అతని కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటి.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
2011 లో కెప్టెన్‌గా ఐసీసీ వన్డే ప్రపంచ కప్
భారతదేశం తన క్రికెట్ చరిత్రలో కేవలం రెండు వన్డే ప్రపంచ కప్‌లను మాత్రమే గెలుచుకుంది. 1975లో ఈ పోటీ ప్రారంభమైనప్పటి నుండి ఒకసారి 1983లో, ఆ తర్వా 2011లో ఎం.ఎస్. ధోనీ నాయకత్వంలో రెండోసారి కప్పును ముద్దాడింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేనిది.