/rtv/media/media_files/2025/07/07/virat-kohli-praise-shubman-gill-2025-07-07-10-48-51.jpg)
virat kohli Praise shubman gill
Virat Kohli - Shubman Gill: జూలై 6 ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రసవత్తరమైన మ్యాచ్(ind-vs-eng) జరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్(IND VS ENG 2ND TEST)లో భారత్ 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఇప్పుడు నెక్ట్స్ మ్యాచ్ లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Also Read: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
గిల్(Shubman Gill)పై కోహ్లీ ప్రశంసలు
ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై మాజీ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill) అద్భుతమైన బ్యాటింగ్‌ను ఎంతో మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్‌ల అద్భుతమైన బౌలింగ్‌ను కూడా కోహ్లీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Also Read: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు గొప్ప విజయం. నిర్భయ ఆటతీరుతో ఇంగ్లాండ్‌ను నిరంతర ఒత్తిడిలో ఉంచింది. శుభ్‌మాన్ బ్యాటింగ్, కెప్టెన్సీలో అద్భుతంగా నాయకత్వం వహించాడు. ప్రతి ఆటగాడూ సహకరించాడు. సిరాజ్, ఆకాష్ బౌలింగ్ ప్రత్యేకంగా ప్రశంసనీయం’’ అని విరాట్ కోహ్లీ (X) లో రాశాడు.
Great victory for India at Edgbaston. Fearless and kept pushing England to the wall. Brilliantly led by Shubhman with the bat and in the field and impactful performances from everyone. Special mention to Siraj and Akash for the way they bowled on this pitch. 👏🇮🇳 @ShubmanGill…
— Virat Kohli (@imVkohli) July 6, 2025
మరోవైపు బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో జట్టు ప్రదర్శన పట్ల కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొదటి టెస్ట్‌లో హెడింగ్లీలో ఓటమి తర్వాత.. జట్టు రూపొందించిన వ్యూహాన్ని ఈ మ్యాచ్‌లో పూర్తిగా అమలు చేశామని గిల్ చెప్పారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగుదల అద్భుతంగా ఉందని అన్నారు.
Also Read: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుతమైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి మొత్తం 430 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. కెప్టెన్‌గా గిల్‌కు ఇది మొదటి టెస్ట్ విజయం కావడం విశేషం.