AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

ఏపీలోని చీరాల వద్ద మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద ఓ కుక్కని ఢీకొట్టింది. దీంతో ట్రైన్ ఎయిర్ బ్రేక్ పట్టేయడంతో రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టింది.

New Update
vande bharat express hits a dog in chirala andhra pradesh

vande bharat express hits a dog in chirala andhra pradesh

ఇవాళ ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తుండగా తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటన మరువక ముందే ఏపీలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

విజయవాడ నుంచి చెన్నై

ఇవాళ బాపట్ల జిల్లా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద మరో వందే భారత్ రైలు ఓ కుక్కని ఢీకొట్టింది. దీంతో ఆ రైలు అక్కడే నిలిచిపోయింది. కుక్కను ఢీకొట్టడంతో ట్రైన్ ఎయిర్ బ్రేక్ పట్టేసింది. దీంతో రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతరం రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టింది. ఇక చాలా సేపటి తర్వాత వందే భారత్ రైలు అక్కడ నుంచి కదిలింది. 

Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్

మరోవైపు ఇవాళ ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తుంది. అదే సమయంలో తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ ట్రాక్‌పై ఉన్న  ఓ ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. 

మరోవైపు వందే భారత్ ట్రైన్ ముందు భాగంలో ఉన్న ఇంజిన్ సైతం బాగా డ్యామేజ్ అయింది. ఈ ఘటనతో వందే భారత్ రైలు కొంత సమయం అక్కడే నిలిచిపోయింది. అనంతరం అధికారులు అక్కడకు చేరుకుని ఘటనను పరిశీలించి ట్రైన్‌ను పంపించేశారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

ఎప్పటికప్పుడు ఘటనలు

వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి తరచుగా పశువులను ఢీకొడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్, తెలంగాణ, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. పశువులు రైల్వే ట్రాక్‌లపైకి రాకుండా నిరోధించడానికి రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్‌ల పక్కన కంచెలు ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రయాణికులు, నిపుణులు సూచిస్తున్నారు.

ఈరోజు జరిగిన ఘటనపై రైల్వే అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు